Coimbatore: సుఖాంతమైన కోయంబత్తూరు లవ్ బర్డ్స్ ఘటన

Coimbatore: పేరెంట్స్‌కు ఇష్టం లేకున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

Update: 2022-03-03 09:00 GMT

సుఖాంతమైన కోయంబత్తూరు లవ్ బర్డ్స్ ఘటన

Coimbatore: అమ్మాయి తరపు కుటుంబ సభ్యులకు ఆ పెళ్లి ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ అప్పటికే ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసుకోవడంతో ఏం చేయలేని నిస్సహాయత వారిది. పైకి పెళ్లికి అంగీకరించినా లోపల మాత్రం ఇద్దరినీ విడదీయాలని మాష్టర్ స్కెచ్ వేశారు. పక్కా సినిమా స్టైల్లో ప్రేమ జంటను నమ్మించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. మొత్తం వ్యవహారాన్ని పసిగట్టిన జంట కారులోంచి దూకి బయటపడింది. ట్రాఫిక్ పోలీసులు జోక్యంతో మొత్తం కథ సుఖాంతమయ్యింది.

కోయంబత్తూర్ చెందిన విఘ్నేష్, స్నేహ కోవై ప్రేమించుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వివాహం చేసుకున్నారు. తమకు ప్రాణ హాని ఉందని పోలీసుల రక్షణ కోరారు. పోలీసుల ఫిర్యాదుతో అమ్మాయి ఫ్యామిలీ సభ్యులు రూట్ మార్చారు. జంటను విడదీయడానికి భారీ స్కెచ్ వేశారు. పెళ్ళిని అంగీకరిస్తామంటూ నమ్మబలికి కారులో మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అదంతా‌ నాటకమని కారెక్కిన తర్వాత ప్రేమ జంటకు అర్థమయ్యింది.

కారు కోయంబత్తూరుకు చేరుకున్నవెంటనే. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులోంచి దూకే ప్రయత్నం చేసారు. రక్షించాలంటూ కేకలు వేశారు. ప్రేమికుల ఆర్తనాదాలు విన్న జనం, ట్రాఫిక్ పోలీసులు జంటకు అండగా నిలిచారు. భర్త విఘ్నేష్‌ను చంపడానికి తన ఫ్యామిలీ సిద్ధమైందంటూ స్నేహ కన్నీటి పర్యంతమైంది. విచారణ జరిపిన పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అచ్చం సినిమా సీన్ ను తలపించిన ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. మొత్తం వ్యవహారం నడిరోడ్డుపై జరగడంతో సోషల్ మీడియాలో జంటకు మద్దతుగా పోస్టులు వైరల్ అవుతున్నాయ్. 

Tags:    

Similar News