‎Chennai: చెన్నై నగరపాలక సంస్థపై హైకోర్టు ఆగ్రహం

‎Chennai: వరదలపై సహాయక చర్యలు చేపట్టారా అంటూ ప్రశ్నలు

Update: 2021-11-09 11:18 GMT

చెన్నై హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Chennai: చెన్నై నగరపాలక సంస్థపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుంటే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారంటూ ప్రశ్నించింది. ప్రజలు వరదల్లోనే జీవించాలా అని క్వశ్చన్‌ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే సుమోటోగా స్వీకరిస్తామని హెచ్చరించింది. ఇక చెరువులు, కాలువలు ఆక్రమణకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు సీరియస్‌ అయ్యింది. కాగా.. గత పాలకుల వల్లే చెన్నైలో వరద కష్టాలన్నారు సీఎం స్టాలిన్‌. స్మార్ట్‌ సిటీ పేరుతో వందలకోట్ల అవనీతికి పాల్పడ్డారన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని వెల్లడించారు.

వారం రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. దాంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులు కాలువలను తలపిస్తుండగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులపాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.

Full View


Tags:    

Similar News