Jharkhand: EDకి జార్ఖండ్ సీఎం సోరెన్ సవాల్..

Jharkhand: ED కి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సవాల్ విసిరారు.

Update: 2022-11-03 16:00 GMT

Jharkhand: EDకి జార్ఖండ్ సీఎం సోరెన్ సవాల్..

Jharkhand: ED కి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సవాల్ విసిరారు. తాను నేరం చేసి ఉంటే విచారణలు ఎందుకు? దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు. నేను నేరం చేసుంటే జార్ఖండ్ వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి జార్ఖండ్ ప్రజలు అంటే మీకు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ స్కామ్ లో ఈడీ సమన్ల జారీ చేసి ఇవాళ విచారణ రావాలని ఆదేశించడంపై స్పందించిన సోరెన్ ఈడీ విచారణకు డుమ్మా కొట్టటమే కాకుండా ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీంతో జార్ఖండ్ లోని ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఈ కేసులో సోరెన్ సహాయకుడు పంకజ్ మిశ్రాను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈడీ అతని వ్యాపార సహచరులతో సంబంధం ఉన్న జార్ఖండ్‌లోని 18 ప్రదేశాలపై దాడులు నిర్వహించి 42 కోట్లకుపైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈ మైనింగ్ వ్యవహారంపై మరింత లోతుగా విచారించేందుకు సీఎం సోరెన్ ను విచారణకు రావాలని సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో సొరోన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

Tags:    

Similar News