జార్ఖండ్ ఫ్లోర్ టెస్టులో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన హేమంత్ సొరెన్

Hemant Soren: మనీ లాండరింగ్ కేసులో గత నెల 31న అరెస్టు అయిన హేమంత్ సొరెన్

Update: 2024-02-05 07:05 GMT

జార్ఖండ్ ఫ్లోర్ టెస్టులో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన హేమంత్ సొరెన్

Hemant Soren: జార్ఖండ్ ఫ్లోర్ టెస్టులో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అసెంబ్లీకి వచ్చారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన హేమంత్ సొరెన్‌కు విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు ఈడీ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు అసెంబ్లీకి వెళ్లారు. జార్ఖండ్‌లో కొత్తగా ఏర్పడిన చంపై సొరెన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఇవాళ విశ్వాస పరీక్షకు వెళ్లింది.

భూ కుభకోణంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో గత నెల 31న హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం చంపై సొరెన్‌ను జెఎంఎం పక్షనేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 1న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సొరెన్ ప్రమాణస్వీకారం చేయగా.... బలపరీక్ష కోసం నేడు అసెంబ్లీ సమావేశమైంది. చంపై సొరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ జార్ఖండ్ అసెంబ్లీకి వచ్చారు.

Tags:    

Similar News