Droupadi Murmu: కూరుకుపోయిన హెలికాప్టర్.. ద్రౌపది ముర్ముకు తప్పిన ప్రమాదం
Droupadi Murmu: కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Droupadi Murmu: కూరుకుపోయిన హెలికాప్టర్.. ద్రౌపది ముర్ముకు తప్పిన ప్రమాదం
Droupadi Murmu: కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో ఇరుక్కుపోవడంతో కొద్ది సేపు ఆందోళన నెలకొంది. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి హెలికాప్టర్‌ను సురక్షితంగా బయటకు తీసి ప్రమాదాన్ని నివారించారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము ఇవాళ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొచ్చి చేరుకున్నారు. ప్రమదం స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు టైర్లు బురదలో కూరుకుపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్‌ను నెట్టి బయటకు తీయగా, రాష్ట్రపతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ ఘటనతో కొంతసేపు షెడ్యూల్‌లో అంతరాయం ఏర్పడింది. అనంతరం రాష్ట్రపతి శబరిమల అయ్యప్ప ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.