తమిళనాడులో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Tamil Nadu: చెన్నై చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు
తమిళనాడులో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Tamil Nadu: కొద్ది రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిత్యావసర సరుకులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.