Chennai: చెన్నైలో భారీ వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Chennai: తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Update: 2023-06-19 09:14 GMT

Chennai: చెన్నైలో భారీ వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు 

Chennai: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. తమిళనాడు రాజధాని చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడి నుంచి ఈ వర్షాలు ప్రజలకు ఉపశమనం కల్పించినప్పటికీ.. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌పాస్‌ల్లోకి నీరు చేరి వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదరుగాలులకు చెట్లు నేలకూలాయి.

చెన్నైలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 102మి.మీల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో చెన్నై సహా చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, వేలూరు, రాణిపేట్‌ జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అటు వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపైకి నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం చెన్నైకు వచ్చే 10 విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Tags:    

Similar News