Heavy Rains: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

Heavy Rains: గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో వర్ష బీభత్సం

Update: 2022-07-13 08:01 GMT

Heavy Rains: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

Heavy Rains: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, అసోంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాదిలో పలుచోట్ల కూడా వర్షాలు కరుస్తున్నాయి. కర్ణాటకలోని తీరప్రాంత జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. సుమారు 15 జిల్లాల పరిధిలో వర్షం హోరెత్తుతోంది. పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టికి విపరీతంగా వరద వస్తోంది. నేత్రావతి నది సైతం పొంగి ప్రవహిస్తోంది. షిమోగా జిల్లా ఆగుంబె ఘాట్‌ వద్ద కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు తోడు హోరుగాలులతో ముంబయి నగరం, శివారు ప్రాంతాలు రెండు గంటలపాటు విలవిలలాడాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు సుమారు 80 మంది మృతిచెందారు.

గుజరాత్‌లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రానున్న అయిదు రోజుల్లో దక్షిణ, మధ్య గుజరాత్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనావేసింది. మరోవైపు వరదల కారణంగా ఇప్పటికే బాగా దెబ్బతిన్న అసోంను వర్షాలు ఇంకా ముంచెత్తుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News