Haryana: హర్యానాలోని గురుగ్రామ్ లో భారీ వర్షాలు.. పూర్తిగా నీటమునిగిన వాహనాలు

Haryana: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు

Update: 2023-06-21 09:31 GMT

Haryana: హర్యానాలోని గురుగ్రామ్ లో భారీ వర్షాలు.. పూర్తిగా నీటమునిగిన వాహనాలు

Haryana: హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్‌లో వర్షం కురువడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు కనిపించింది. నార్సింగ్‌పూర్ చౌక్ నుండి పలు వాహనాల టైర్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నీటమునిగిన రోడ్లతో భారీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.

ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించారు. భారీ నీటి ఎద్దడి కారణంగా కొన్ని స్ట్రెచ్‌లను నివారించాలని ప్రయాణికులను కోరారు. వీటిలో సిగ్నేచర్ టవర్ రోడ్, ఇఫ్కో చౌక్, షీత్లా మాతా రోడ్ తో సహా పలు మెట్రో స్టేషన్ దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.

Tags:    

Similar News