Delhi: ఢిల్లీని ముంచెత్తిన వాన.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

Delhi: భారీగా ట్రాఫిక్ జామ్‌... ఇబ్బంది పడుతున్న వాహనదారులు

Update: 2022-09-23 04:45 GMT

Delhi: ఢిల్లీని ముంచెత్తిన వాన.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

Delhi: దేశ రాజధాని ఢిల్లీని రెండో రోజూ వర్షం ముంచెత్తింది. భారీ వానకు రోడ్లన్నీ జలమయమవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అటు ఢిల్లీ శివార్లలో కుండపోత వర్షం దంచికొట్టింది. హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ- గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే జలమయమైంది. రోడ్లని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పలు వాహనాలు నిలిచిపోవడంతో.. ప్రయాణికులు నడుం లోతు నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో కార్లు నీటమునిగాయి.

ఇక ఇవాళ కూడా ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ప్రకటించింది. మూడు నుంచి నాలుగు గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

Tags:    

Similar News