Heavy Rain: ఢిల్లీ నగరానికి రెడ్ అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
Heavy Rain: దేశరాజధాని ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామునే ఈదురుగాలులు ఢిల్లీని వణికించాయి.
Heavy Rain: ఢిల్లీ నగరానికి రెడ్ అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
Heavy Rain: దేశరాజధాని ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామునే ఈదురుగాలులు ఢిల్లీని వణికించాయి. ఒక్కసారిగా గాలులతో పాటు వర్షం కూడా దంచికొట్టడంతో రాజధాని నగరం చిగురుటాకులా వణికింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. భారీ ఈదురుగాలులు వీచడంతో పలుచోట్ల నగరంలో చెట్లు కూడా నేలకొరిగాయి.
ఇక రానున్న కొద్దిగంటల్లో కూడా భారీ వర్షం దేశ రాజధానిని ముంచెత్తనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మరోవైపు వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వంద విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా... 40 విమానాలను దారి మళ్లించారు.