మరో గంటలో అమర్‌నాథ్‌కు భారీ వర్షసూచన.. వరదలు ముంచెత్తుతాయని ముందస్తు హెచ్చరిక

Amarnath Yatra: మరో గంటలో అమర్‌నాథ్‌లో భారీగా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Update: 2022-07-09 05:41 GMT

మరో గంటలో అమర్‌నాథ్‌కు భారీ వర్షసూచన.. వరదలు ముంచెత్తుతాయని ముందస్తు హెచ్చరిక

Amarnath Yatra: మరో గంటలో అమర్‌నాథ్‌లో భారీగా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వరదలు ముంచెత్తుతాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణశాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యాత్రలో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. వరదల ఉధృతికి 16 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. 14 మృతదేహాలను నీలగ్రార్‌ క్యాంపు వరకు తీసుకువచ్చారు. ఇప్పటికే వరదలతో అమర్‌నాథ్‌ ప్రాంతంలో అల్లకల్లోలంగా మారింది. ఐనా వరుణుడు శాంతించకపోవడంతో స్థానికులు, భక్తులు టెన్షన్‌ పడుతున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం భారీ వర్షం పడితే కొండలను చీల్చే వరదలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News