Floods: ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు

Floods: ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, నాలాలు * ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న అమ్లావా నది

Update: 2021-07-13 13:54 GMT

ఉత్తరాది రాష్ట్రాలలో వరదలు (ఫైల్ ఇమేజ్)

Floods: ఉత్తరాది రాష్ట్రాల్లో వరద భీబత్సం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, యూపీ, ఎంపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రాణాలకు తెగించాల్సివస్తోంది. ముఖ్యంగా నదులు, నాలాలను దాటడానికి ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది.

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలకు అమ్లావా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. డెహ్రాడూన్ జిల్లాలో అమ్లావా నదిపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి ఓవైపు విరిగి నదిలో పడిపోయింది. అయినప్పటికీ ప్రజలు విరిగిన ఆ బ్రిడ్జినే ఆసరాగా చేసుకుని, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నదిని దాటుతున్నారు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కంటికి కనిపించని రీతిలో కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నా స్థానికుల్లో భయమనేదే కనిపించడంలేదు.

మరోవైపు ప్రమాద ఘంటికలు మోగుతున్నా అధికారుల స్పందన కరువైంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం ఈ డెత్ క్రాసింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అత్యంగా ప్రమాదం అని తెలిసినా ప్రాణాలకు తెగించి నదిని దాటాల్సిన అవసరమేంటన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Full View


Tags:    

Similar News