Arvind Kejriwal: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ.. ఈడీ స్పందన కోరిన ఢిల్లీ హైకోర్టు..

Arvind Kejriwal: ఈడీ సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్

Update: 2024-03-20 11:57 GMT

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ.. ఈడీ స్పందన కోరిన ఢిల్లీ హైకోర్టు..

Arvind Kejriwal: మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ సమన్లను సవాల్‌ చేస్తూ.. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ రెండు వారాల గడువును ఈడీకి ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 22వ తేదీన ఉంటుందని తెలిపింది. లిక్కర్‌ కేసులో తొలి నుంచి ఈడీ సమన్లను కేజ్రీవాల్‌ పట్టించుకోవడం లేదు. ఈలోపు ఈడీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన బెయిల్‌ తెచ్చుకున్నారు. ఈలోపు మార్చి 21న తమ ముందు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది.

దీంతో ఈడీ నుంచి తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ అయినట్లైంది. అయితే.. ఈ సమన్లపై ఢిల్లీ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలను ఉల్లంఘిస్తూ జారీ చేశారని కేజ్రీవాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్, మనోజ్ జైన్‌లతో కూడిన ధర్మాసనం.. చివరకు ఈడీని వివరణ కోరుతూ విచారణ వాయిదా వేసింది.

Tags:    

Similar News