Haryana: హరియాణాలో కొనసాగుతోన్న హై అలర్ట్‌

Haryana: నుహ్‌ అల్లర్లతో రాష్ట్రంలో టెన్షన్‌ వాతావరణం

Update: 2023-08-02 06:41 GMT

Haryana: హరియాణాలో కొనసాగుతోన్న హై అలర్ట్‌

Haryana: నుహ్‌ అల్లర్లతో హరియాణా అట్టుడుకుతోంది. తాజాగా ఆ అల్లర్లు గురుగ్రామ్‌ను తాకాయి. గత రాత్రి గురుగ్రామ్‌లో కొందరు వ్యక్తులు బాద్షాపూర్‌ ఏరియాలో అల్లర్లకు పాల్పడ్డారు. పలు షాపులు, రెస్టారెంట్లు తగలబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురుగ్రామ్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ బలగాలను రంగంలోకి దించారు. మరోవైపు నుహ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సెక్యురిటీని కట్టుదిట్టం చేసిన పోలీసులు.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను కొనసాగిస్తున్నారు. నుహ్‌కు సమీపంలోని ఫరీదాబాద్, పల్వాల్‌ జిల్లాల్లోనూ భద్రత పెంచారు. మరోవైపు హర్యానా ఆందోళనలు ఢిల్లీకి పాకుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ సభ్యులపై దాడులను ఖండిస్తూ ఢిల్లీలో VHP నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

జులై 31న నుహ్‌లో వీహెచ్‌పీ ర్యాలీ సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఘర్షణల్లో 6 మంది మృతి చెందగా.. అందులో నలుగురు పౌరులు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. నుహ్‌ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు 41 FIRలు నమోదు చేశారు. నుహ్‌ ప్రాంతంలో అల్లర్లకు పాల్పడిన 116 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన హరియాణా సీఎం.. ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణల వెనుక కుట్రకోణం ఉందని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News