Sandeep Singh: లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్‌ సింగ్ రాజీనామా

Sandeep Singh: తనను లైంగికంగా వేధించాడని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఆరోపణ

Update: 2023-01-01 10:26 GMT

Sandeep Singh: లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్‌ సింగ్ రాజీనామా

Sandeep Singh: లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్‌ సింగ్ రాజీనామా చేశాడు. తనను లైంగికంగా వేధించాడని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఆరోపించింది. తన పరువు తీయడానికి కుట్ర పన్నారంటూ క్రీడామంత్రి సందీప్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రి సందీప్‌సింగ్‌పై మహిళా కోచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్‌సింగ్ తనను ఒక రోజు చూశాడని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యాడని మహిళా కోచ్ తెలిపింది.

ఓసారి అతన్ని కలవడానికి ఆఫీస్‌కు వెళ్తే వేధించాడన్న మహిళా కోచ్ కేబిన్‌లోకి తీసుకెళ్లి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సందీప్‌సింగ్ తెలిపాడు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆ మహిళా కోచ్ గతాన్ని కూడా పరిశీలించాలన్నాడు సందీప్‌ సింగ్.

Tags:    

Similar News