Haiti President Jouvenel Moiz: హైతీ దేశాధ్యక్షుడు దారుణ హత్య

Haiti President Jouvenel Moiz: కరేబియన్ దీవుల సముదాయంలో హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్ మోయిన్(53) హత్యకు గురయ్యారు.

Update: 2021-07-08 02:07 GMT

Haiti President Jouvenel Moiz

Haiti President Jouvenel Moiz: కరేబియన్ దీవుల సముదాయంలో హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్ మోయిన్(53) హత్యకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఈఘటన జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి అధ్యక్షుడితోపాటు ఆయన సతీమణిపై తుపాకులతో దాడికి పాల్పడినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్‌ వెల్లడించారు. ఈ దాడిలో అధ్యక్షుడు మృతిచెందగా ఆయన భార్య, దేశ మొదటి మహిళ మార్టిన్‌ మోసీ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సాయుధ కమాండో గ్రూపు సభ్యులే ఇందుకు కారణమని ఆరోపించారు. ఈ గ్రూపులో కొన్ని విదేశీ వ్యక్తుల ప్రమేయం ఉందని అన్నారు. ఇంగ్లీష్, స్పానిష్ భాషలు మాట్లాడిన విదేశీయులే ఇందుకు కారణమని, ఇది విద్వేషపూరితం, అమానుషం, ఆటవికం అని ఆయన వ్యాఖాయనించారు. ప్రస్తుతం దేశ బాధ్యతలను తానే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

దేశంలోని పేదరికం, అవినీతి, రాజకీయ అస్థిరత, ధరలు ముఖ్యంగా పెట్రోల్ పెరుగుదల, ఆర్థిక తిరోగమనం, అభద్రత ఇందుకు కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఆహారం, ఇంధనం లభ్యత కష్టతరంగా మరింది. ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత పేద దేశమైన హైతీలో అయితే నిరంకుశత్వం, లేదంటే రాజకీయ అస్థిరత అన్న చందంగా పరిస్థితులు ఉంటున్నాయి. రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ సహా పలు చోట్ల సాయుధ ముటాల కిడ్నాప్ లు, దౌర్జన్యాలు సర్వసాధారణంగా మారాయి. రాజధానిలో వీధులపై ఆదిపత్యం కోసం ఈ ముటాల మధ్య ఘర్షణలు కూడా ఎక్కువయ్యాయి. కొన్ని సార్లు పోలీసులతోనూ తలబడ్డాయి. ఈ కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడం కొత్త సమస్యను తెచ్చిపెడుతునానయి. పార్లమెంటు లేకుండానే అధ్యక్షుడు పాలన సాగించడం కూడా తీవ్ర అసంతృప్తికి కారణమయింది.

మరి కొద్దీ నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ సందర్భంగా హింస మరింత పెరగవచ్చునన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడి హత్యతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగే అవకాశం ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజన్స్‌ విభాగం హెచ్చరించింది.

Tags:    

Similar News