Delhi: ఢిల్లీలోని అంబేద్కర్‌నగర్ బస్తీలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
Delhi: అంబేద్కర్ బస్తీ ప్రాంతంలో ఇద్దరు మహిళలను చంపిన దుండగులు
Delhi: ఢిల్లీలోని అంబేద్కర్‌నగర్ బస్తీలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
Delhi: ఢిల్లీ ఆర్‌కేపురంలో దారుణం జరిగింది. అంబేద్కర్ బస్తీ ప్రాంతంలో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతులను పింకీ , జ్యోతి గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు వారిని కాల్చడంతో వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
అంబేద్కర్ బస్తీలో కాలర్ సోదరులను కొందరు వ్యక్తులు కాల్చిచంపారని ఆర్కే పురంపోలీసులకు కాల్ వచ్చిందని సౌత్ వెస్ట్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు . ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఎస్‌జే ఆసుపత్రికి తరలించగా, వారు మరణించారని అన్నారు. ఢిల్లీ పోలీసులు ప్రధాన నిందితుడిని, అతని సహచరుడిని అరెస్టు చేశారు.