Surya Namaskar: ఒకేసారి 108 చోట్ల సూర్య నమస్కారాలు.. న్యూఇయర్ రోజున గుజరాత్ గిన్నిస్ రికార్డ్

Surya Namaskar: ట్విట్టర్‌ ఖాతాలో ఫొటోలు పంచుకున్న ప్రధాని నరేంద్రమోడీ

Update: 2024-01-01 11:03 GMT

Surya Namaskar: ఒకేసారి 108 చోట్ల సూర్య నమస్కారాలు.. న్యూఇయర్ రోజున గుజరాత్ గిన్నిస్ రికార్డ్

Surya Namaskar: కొత్త ఏడాది రోజు గుజరాత్‌ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోజూవారీ దినచర్యలో సూర్యనమస్కారాన్ని భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ కోరారు. సూర్య నమస్కారాల వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.


Tags:    

Similar News