GST News: మధ్య తరగతి, దిగువ తరగతికి గుడ్ న్యూస్

GST on health insurance and life insurance: మధ్య తరగతి, దిగువ తరగతికి గుడ్ న్యూస్

Update: 2025-04-17 16:45 GMT

GST on health and life insurance: మధ్య తరగతి, దిగువ తరగతికి గుడ్ న్యూస్ రానుంది. త్వరలోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు మిడిల్ క్లాస్ , లోయర్ మిడిల్ క్లాస్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కేంద్రం 18% GST ఛార్జ్ చేస్తోంది. కానీ త్వరలోనే ఈ జీఎస్టీని 5 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

జాన్ లేదా జూలై ఆరంభంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ( GST Council meeting ) జరగనుంది. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాదు, ఇన్సూరెన్ పాలసీలపై ప్రీమియంను 5 శాతానికి తగ్గించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

వాస్తవానికి ఇదే విషయమై విపక్షాలు ఎప్పటి నుండో కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. జీఎస్టీ కారణంగా పేద , మధ్య తరగతి ప్రజలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే పరిస్థితే లేకుండా పోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇన్సూరెన్స్ పై జీఎస్టీ పూర్తిగా మినహాయించాలని ఇండియా బ్లాక్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

గతేడాది చివర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే కేంద్రం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు.  

Tags:    

Similar News