MP Shashi Tharur Accepted Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఎంపీ శశి థరూర్
MP Shashi Tharur Accepted Green India Challenge: ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతుంది. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను తిరువంతపురం ఎంపీ శశి థరూర్ స్వీకరించారు.
Green india Challenge accepted by mp shashi tharur
MP Shashi Tharur Accepted Green India Challenge: ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతుంది. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను తిరువంతపురం ఎంపీ శశి థరూర్ స్వీకరించారు. ఈ క్రమంలో శశి థరూర్ ఢిల్లీ లోని తన అధికార నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా శశి థరూర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్.... ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం అశ్రద్ధ వహించామని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇకనైనా దీన్ని ప్రతి ఒక్కరు బాధ్యయుత ఛాలెంజ్ గా తీసుకొని ఇండియాని గ్రీన్ ఇండియా గా మార్చాలి. ఈ అవకాశం కల్పించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో కర్ణాటక రాజ్యసభ సభ్యులు జయరామ్ రమేష్ , బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ,బీజేపీ బైజయంత్ జయ్ పాండా , ఎంపీ గుర్జిత్ సింగ్ ఔజ్ల , వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు .