Akkineni Naga Chaitanya Accept Green India Challenge: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో నవ యువసమ్రాట్‌!

Akkineni Naga Chaitanya Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Krishna
Updated on: 18 Aug 2020 10:56 AM IST
Akkineni Naga Chaitanya Accept Green India Challenge:  గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో నవ యువసమ్రాట్‌!
X
Akkineni Naga Chaitanya Accept Green India Challenge

Akkineni Naga Chaitanya Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగా తాజాగా హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

దర్శకురాలు నందిని రెడ్డి విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ని స్వీకరించిన నాగచైతన్య గచ్చిబౌలిలోని తన నివాసంలో మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ... మనకు జీవించడానికి భూమి ఒక్కటే ఆధారం.. అలాంటి ఆధారం అయిన భూమిని మనం కచ్చితంగా కాపాడుకోవాలి.. విరివిగా మొక్కలు నాటి, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగం కావాలని కోరుతున్నాను అని నాగచైతన్య అన్నారు.. ఇక ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చైతూ వెల్లడించాడు. ఇక తనవంతుగా హీరో సుశాంత్‌, డైరెక్టర్‌ శివ నిర్వాణ, హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, డైరెక్టర్‌ విక్రమ్‌ కే కుమార్‌ లకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు నామినేట్‌ చేశాడు.



ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వచ్చేసరికి గతఏడాది తన మామ వెంకటేష్ తో కలిసి వెంకీ మామ అనే సినిమాలో నటించాడు నాగచైతన్య.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పాటలు సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

Krishna

Krishna

Next Story