లాక్ డౌన్ ఉన్నా ఆహార ధాన్యాలకు ఇబ్బంది లేదు.. అది కూడా ఎన్నిరోజులంటే..

ప్రస్తుతం భారతదేశం COVID-19 వ్యాప్తిపై పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి.

Update: 2020-03-23 04:00 GMT

ప్రస్తుతం భారతదేశం COVID-19 వ్యాప్తిపై పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి.ఈ క్రమంలో ఇలా అయితే ఆహార పదార్ధాల పరిస్థితి ఏంటన్నది పలువురి ప్రశ్న.. వాస్తవానికి భారత్ లో ఒక సంవత్సరం పాటు లాక్డౌన్ ఉన్నా.. పేదలకు సరిపడా ధాన్యం, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు చక్కెర నిల్వలు పరిపుష్టిగా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్ ప్రభుత్వాలు రోజువారీ కూలీలు, రిక్షా పుల్లర్లు ,పేద మరియు బలహీన వర్గాలకు ముందుగానే ఉచిత రేషన్లను పంపిణీ చేయాలని నిర్ణయించాయి. దీంతో చాలా వరకూ ఆహార ధాన్యాలు అవసరం అవుతాయి. వాస్తవానికి అధికారిక అంచనాల ప్రకారం, మార్చి 10 నాటికి ఆహార ధాన్యం (గోధుమ మరియు బియ్యం) 58.49 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇది సాధారణ కాలంలో బఫర్‌గా అవసరమయ్యే దానికంటే చాలా ఎక్కువ. అలాగే, సుమారు 3 మిలియన్ టన్నులు పప్పుధాన్యాలు, 1.1 మిలియన్ టన్నులు నూనెగింజలు మరియు 4 మిలియన్ టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయి.

ఆ 58.49 టన్నుల ధాన్యం ద్వారా అన్ని రేషన్ కార్డ్ హోల్డర్లు మరియు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంవత్సరం పాటు పంపిణీ చెయ్వవచు. దానికి తోడు గోధుమల సేకరణ వచ్చే నెల నుండి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది.. 2020 లో పంట దిగుబడి అంచనా 106 మిలియన్ టన్నుల గా ఉంటే.. అంతకంటే ఎక్కువ మొత్తంలో ఈసారి దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల రేషన్ స్టాక్ కోటాను ఆరు నెలల ముందుగానే అన్ని రాష్ట్రాలకు పంపిణి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

2018-19లో రేషన్ షాపుల నెట్‌వర్క్ ద్వారా దేశంలో సుమారు 57 మిలియన్ టన్నుల గోధుమలు, బియ్యం పంపిణీ చేశారు. ఇవి కాక రక్షణ దళాల అవసరాలతో పాటు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం), మిడ్-డే భోజన పథకం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐసిడిఎస్) మరియు అన్నపూర్ణ యోజన వంటి పథకాలకు అవసరమైన ఆహార ధాన్యాలు కూడా ఈ మొత్తంలోనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక సంవత్సరం పాటు ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి.   

Tags:    

Similar News