Ration Card: రేషన్‌కార్డ్ దారుల‌కు హెచ్చ‌రిక‌.. ఇక వారికి రేష‌న్ బంద్‌..!

*రేషన్ కార్డ్ పేద‌ల‌కు ఆహారాన్ని అందించే ఒక గుర్తింపు కార్డు *పేదలకు మాత్రమే రేషన్‌ కార్డు అత్యంత అవసరం

Update: 2021-10-20 09:45 GMT

పేదలకు మాత్రమే రేషన్‌ కార్డు అత్యంత అవసరం(ఫైల్ ఫోటో)

Ration Card: రేషన్ కార్డ్ పేద‌ల‌కు ఆహారాన్ని అందించే ఒక గుర్తింపు కార్డు. బీపీఎల్ కుటుంబాల కోసం ప్ర‌వేశ‌ప‌పెట్టారు. కానీ చాలామంది అన‌ర్హులు దీనిని క‌లిగి ఉన్నారు. అర్హులైన అభ్యర్థులు ఇప్ప‌టికీ దీనికోసం ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు. రేష‌న్‌కార్డ్ ఒక గుర్తింపు కార్డు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వం అందించే సేవ‌ల‌ను సులువుగా పొంద‌వ‌చ్చు. కానీ అక్ర‌మార్కులు వీటిని పొంది ప్ర‌భుత్వం అందించే స‌బ్సిడీలు, ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పేద‌వారికి చేర‌కుండా చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డాయి.

చాలా మంది అనర్హులు రేషన్‌కార్డు కలిగి ఉండి నిబంధనలకు విరుద్దంగా సరుకులు తీసుకుంటున్నారని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం అనర్హులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా చర్చలు కూడా జరగినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల ప్రతిపాదనలను, సూచనలను పరిగణలోకి తీసుకొని కేంద్రం త్వరలో కొత్త నిబంధనలను జారీ చేయనుంది. పేదలకు మాత్రమే రేషన్‌ కార్డు అత్యంత అవసరం. కానీ ఆర్థికంగా ఉన్నవారు కూడా చాలామంది రేషన్‌ కార్డుని కలిగి ఉన్నారు. కొత్త రూల్స్‌ వస్తే ఇలాంటి వారికి ఇక రేషన్‌ కార్డు ఉండదు.

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. అయితే దేశంలో చాలా కుటుంబాలకు ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కావాలన్నా, కార్డును పునరుద్ధరించాలన్నా, కొత్త సభ్యుడి పేరును చేర్చాలన్నా, దాదాపు 10 రకాల పత్రాలు అవసరం. కొత్త సాఫ్ట్‌వేర్ కారణంగా ఇది జరిగిందని నివేదికలలో చెబుతున్నారు. జిల్లా సరఫరా అధికారుల ప్రకారం జాతీయ ఆహార భద్రతా పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని ద్వారా రేషన్ కార్డులు జారీ చేస్తారు. దీంతో త్వరలో కొత్త నిబంధనలు అమలుకాబోతున్నాయి.

Tags:    

Similar News