Parliament Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవుతున్న కేంద్రం.. వాట్ ఈజ్ ఎజెండా..?
Parliament Session: ప్రత్యేక సమావేశాల ఎజెండా వెల్లడించకపోవడంపై విపక్షాల అభ్యంతరం
Parliament Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవుతున్న కేంద్రం.. వాట్ ఈజ్ ఎజెండా..?
Parliament Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనుండగా.. ఈనెల 17న అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్దమైంది. అయితే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన కేంద్రం.. సమావేశ ఎజెండాను వెల్లడించకపోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఐదు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, మహిళా బిల్లు లాంటి బిల్లులు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే.. వీటిలో ఏ విషయంపైనా ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీంతో అఖిలపక్ష భేటీలోనే ఎజెండా వెలువడే అవకాశాలున్నాయి.