New IT Rules: ఐటీ రూల్స్ అమలు చేసిన ఫేస్‌బుక్, గూగుల్

New IT Rules: భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను ఫేస్‌బుక్, గూగుల్ అమలు చేశాయి.

Update: 2021-07-03 16:00 GMT

New IT Rules: ఐటీ రూల్స్ అమలు చేసిన ఫేస్‌బుక్, గూగుల్

New IT Rules: భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను ఫేస్‌బుక్, గూగుల్ అమలు చేశాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్య ఏకంగా మూడు కోట్ల కంటెంట్ల డేటా డిలీట్ చేసినట్లు ప్రకటించాయి. ఐటీ రూల్స్‌ అమలుకు ట్విట్టర్ మొండికేస్తున్న నేపధ్యంలో ఫేస్‌బుక్, గూగుల్‌ సంస్థలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. ఫేస్‌బుక్, గూగుల్ మంత్లీ రిపోర్ట్ వెల్లడైన వేళ ట్విట్టర్ యాక్షన్ ప్లానేంటి.? గ్రీవెన్స్ అధికారి నియామకంలో అసలేం జరుగుతోంది.?

ఫేస్‌బుక్, గూగుల్ ఓకే చెప్పాయి.. కొత్త ఐటీ రూల్స్‌ను అమలు కూడా చేసేశాయి.! అంతేనా, 30 రోజుల్లో మూడు కోట్ల కంటెంట్‌ను లేపేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. మరి ట్విట్టర్ మాటేంటి.? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. అయితే, ట్విట్టర్‌కూడా లోకల్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ నియామక ప్రక్రియ ఫైనల్ స్టేజ్‌లో ఉందని క్లారిటీ ఇచ్చేసింది. ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ ప్రకటన చేసింది.

మరోవైపు మంత్లీ రిపోర్ట్ ప్రకటించిన ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. ఫేస్‌బుక్ 30 మిలియన్ల అభ్యంతరకర పోస్టులు తొలగిస్తే గూగుల్ 59వేల 350 వివాదాస్పద లింకులు లేపేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఫేస్‌బుక్‌లో 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకోగా అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికపై 20లక్షల కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

2.5కోట్ల స్పామ్‌ సంబంధిత కంటెంట్‌, హింసను ప్రేరేపించేలా ఉన్న 25లక్షల పోస్టులు, నగ్నచిత్రాలు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన 18లక్షల కంటెంట్లు, విద్వేషాన్ని పెంచేలా ఉన్న 3లక్షల పోస్టులు, ఆత్మహత్యలకు సంబంధించి 5.8లక్షల పోస్టులు, వేధింపులు, ఉగ్రవాద ప్రచారం వంటి కంటెంట్లపై కంపెనీ చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.

ఇక.. దేశీ యాప్ 'కూ' కూడా కంప్లయన్స్ నివేదిక వెలువరించంది. మొత్తం 5వేల 502 ఫిర్యాదులు అందాయని వీటికి సంబంధించి 12వందల 53 పోస్టులు తొలగించినట్లు ప్రకటించింది. ఫేస్‌బుక్, గూగుల్‌ అభ్యంతరకర కంటెంట్‌ను డిలీట్ చేయడం పట్ల కుంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేంద్ర మంత్రి పారదర్శకత సాధించే దిశగా ఇది కీలక ముందడుగు అని అభివర్ణించారు. 

Tags:    

Similar News