Edible Oil Price Down: సామాన్యుకులకు కేంద్రం శుభవార్త.. తగ్గనున్న వంటనూనె ధరలు

Edible Oil Price Down: వంట నూనె ధరల పెంపు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్రం నిర్ణయం కొంత మేర ఉపశమనం కలిగించింది...

Update: 2021-12-22 04:28 GMT

Edible Oil Price Down: సామాన్యుకులకు కేంద్రం శుభవార్త.. తగ్గనున్న వంటనూనె ధరలు

Edible Oil Price Down: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంట నూనె ధరల పెంపు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్రం నిర్ణయం కొంత మేర ఉపశమనం కలిగించింది. రిఫైన్డ్ పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. 2022 మార్చ్ వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ చర్యల వల్ల దేశీయ విపణిలో సరఫరా పెరిగి, ధరలు తగ్గుతాయని అంచనా.

ఇక బీసీడీ తగ్గింపు వల్ల రిఫైన్డ్ పామాయిల్, రిఫైన్డ్ పామోలిన్‌లపై మొత్తం సుంకం 19.25 శాతం నుంచి 13.75 శాతానికి తగ్గనుందని ఎస్‌ఈఏ పేర్కొంది. సోమవారం కిలో వేరుసెనగ నూనె ధర 181.48, ఆవాల నూనె 187.43, వనస్పతి 138.5, సోయాబీన్‌ నూనె 150.78, సన్‌ప్లవర్ ఆయిల్ 163.18, పామాయిల్‌ 129.94 రూపాయలుగా ఉన్నాయి. శుద్ధి చేసిన పామాయిల్‌ను లైసెన్సు లేకుండా 2022 డిసెంబరు వరకు దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఇక కంది పప్పు, మినపప్పు, పెసరపప్పుల దిగుమతులను 2022 మార్చి 31 వరకు స్వేచ్ఛా విభాగం కింద చేసుకునేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. వాస్తవానికి ఈ గడువు 2021 డిసెంబరు 31 వరకే ఉంది. వీటి దిగుమతులను పరిమితుల నుంచి స్వేచ్ఛా విభాగంలోకి మార్చడం వల్ల దేశీయంగా పప్పుదినుసుల సరఫరా పెరిగి, ధరలు అదుపులో ఉంటాయన్నది ప్రభుత్వ అంచనా. గిరాకీకి తగినట్లుగా దేశీయంగా దిగుబడి లేనందున భారత్‌ పప్పు ధాన్యాలను కొంతమేర దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పప్పు దినుసుల వినియోగం 26 మిలియన్‌ టన్నులుండగా, 9.5మిలియన్‌ టన్నులు పండుతున్నాయని అంచనా.

Tags:    

Similar News