ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇండియాలో ఇంటర్న్‌షిప్‌కు...

Ukraine Medical Students: దేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రవేశాలు...

Update: 2022-03-05 03:55 GMT

ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇండియాలో ఇంటర్న్‌షిప్‌కు...

Ukraine Medical Students: దేశం కాని దేశంలో భారత విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం స్టూడెంట్స్‌ను కోలుకోని దెబ్బతీసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ స్వదేశానికి చేరుకుంటున్నారు వైద్య విద్యార్థులు. ఉన్నత చదువులను మధ్యలోనే వదిలేసి బతుకు జీవుడా అంటూ ఇండియాకు తరలి వస్తున్నారు. చదువు మధ్యలోనే వదిలేసి వచ్చిన భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

వారికి ఇక్కడే ఆయా కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇంటర్న్‌షిప్ మధ్యలో ఉన్న, ప్రారంభించాల్సిన వైద్యవిద్యార్థులకు భార‌త్‌లోనే ఆ అవకాశం కల్పించాలని జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో వీరికి ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్ఎంసీ నిబంధనలు సడలించనున్నారు.

నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారు అక్కడే ఇంటర్న్ షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. భారత్‌లో వైద్యుడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. యుద్ధంతో మెడికల్ గ్రాడ్యుయేట్స్ తమ మిగిలిపోయిన ఇంటర్న్ షిప్‌ను ఇండియాలో పూర్తి చేయడానికి ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. అయితే ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణులై ఉండాలని ఎన్ఎంసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2021 నవంబర్ 18కి ముందు వైద్య విద్య పట్టా పొందిన వారికి ఈ నిబంధనలు వర్తించవని ఎన్‌ఎంసీ పేర్కొంది.

Tags:    

Similar News