Gold: అనంత పద్మనాభస్వామి ఆలయంలో బంగారు కడ్డీ మాయం..అంతా మిస్టరీయే

Update: 2025-05-14 04:24 GMT

Gold: అనంత పద్మనాభస్వామి ఆలయంలో బంగారు కడ్డీ మాయం..అంతా మిస్టరీయే

Gold: కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో మే 10న మిస్సింగ్ అయినట్లు తెలిపిన 107 గ్రాముల బంగారు కడ్డి మాయం కొత్తమలుపు తిరిగింది. ఆ కడ్డీ తిరిగింది కానీ అందులో ఇంకా చాలా ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం అయ్యింది. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాల్లో ఒకటి. ఇక్కడి సంపద, బంగారం, ఆభరణాలు సుమారు 1,20,000కోట్లు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ధనిక గుడిగా చెబుతుంటారు. హిందూమతస్తులు మాత్రమే లోపలికి వెళ్తారు. పురుషులు ధోవతి, స్త్రీలు చీర మాత్రమే కట్టుకోవాలి. ఈ గుడిలో 365 రాతి స్తంభాలపై అద్బుతమైన శిల్పాలు చెక్కి ఉన్నాయి. వీటిలో నాలుగో వంతు గ్రానైట్ రాళ్లపై అత్యంత అందంగా చెక్కి ఉన్నాయి.

మరీ ఈ కేసు ఏంటి?

మే 10న గుడిబల్ల దగ్గర ఉంచిన బంగారు కడ్డీ మాయం అయ్యింది. ఇది కాడ్మియం మిశ్రమంలో ఉండేది. ఆదివారం సాయంత్రం 5గంటలకు గుడి ఉత్తర ద్వారా దగ్గర పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఇసుకలో ఇది దొరికింది. దీన్ని పోలీసులు ధ్రువీకరించారు. కానీ కడ్డీ ఎందుకు మాయం అయ్యింది..ఎలా దొరికిందన్న ప్రశ్నలకు సంబంధించి దర్యాప్తు మొదలైంది. అయితే ఇది చోరీ కేసు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ కబడ్డీని ఉంచిన గుడ్డ సంచిలోంచి అది ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదు. అలాంటి ద్రుశ్యాలు కూడా సీసీటీవీలో లేవు. గుడి బల్లలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. పునర్నిర్మాణ ప్రాంతంలో కెమెరాలను ఇటీవలే పోలీసుల జోక్యంతో రిపేర్ చేశారు. బంగారు కబడ్డీని పని ప్రదేశం నుంచి బల్ల దగ్గరకు తరలించే పనిని గుడి అధికారులు, పోలీసులు కలిసి నిర్వహిస్తారు. ప్రస్తుతం పోలీసులు, ఆలయ సిబ్బందితోపాటు కార్మికులను ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News