Corona in Goa: గోవాలో ప్రైవేటు ఆస్పత్రులన్నీ సర్కార్ ఆధీనంలోకి

Corona in Goa: గోవారాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులన్నింటినీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

Update: 2021-05-16 00:43 GMT

Goa Medical College:(File Image)

Corona in Goa: గోవా రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులన్నింటినీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. సోమవారం నుంచి కోవిడ్ ఆస్పత్రులన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు.. గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 70 మందికి పైగా చనిపోయిన ఘటనతో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతే కాదు కోవిడ్ రోగుల వైద్యానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

ఆస్పత్రుల సిబ్బంది వారే ఉంటారని.. నియంత్రణ మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం సావంత్ వెల్లడించారు. ప్రతి కోవిడ్ ఆస్పత్రిపై ఒక ప్రభుత్వ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగిన మరుసటి రోజే సీఎం సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో కోవిడ్ పరిస్థితులు, ఆక్సిజన్ అందక రోగులు చనిపోయిన ఘటనపై తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News