Coronavirus : గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు రోజులు వాయిదా

గోవా లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు రెండు రోజులు వాయిదా పడ్డాయి.

Update: 2020-03-21 05:32 GMT
Goa CM Pramod Sawant

గోవా లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు రెండు రోజులు వాయిదా పడ్డాయి..ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గురువారం ఆలస్యంగా ప్రకటించారు, మార్చి 22 న జరగాల్సిన జిల్లా పంచాయతీ ఎన్నికలు మార్చి 24 కి వాయిదా వేస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ "మన్ కి బాత్" అలాగే "జనతా కర్ఫ్యూ "ను ఉన్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఇసి(రాష్ట్ర ఎన్నికల కమిషనర్)తో సంప్రదించి జెడ్‌పి పోలింగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించింది. మార్చి 24వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్వహించుకున్నట్టు.. ఎన్నికల కమిషనర్ ఆర్కె శ్రీవాస్తవతో సమావేశం తరువాత ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

కరోనావైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ, జిల్లా పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరుపుతున్నారని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను ప్రశ్నించాయి, ప్రతిపక్ష ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయి జిల్లా పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. 50 నియోజకవర్గాల్లో మొత్తం 1,237 పోలింగ్ బూత్‌ల ద్వారా రాబోయే జెడ్‌పి ఎన్నికలను నిర్వహించనున్నారు, ఇందులో 203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8.91 లక్షల మంది ఓటర్లు బ్యాలెట్ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Tags:    

Similar News