అంకిత్ శర్మను హత్య చేసిన వారికి మరణశిక్ష విధించాలి

గత నెలలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది మృతి వెనుక దోషులుగా తేలిన వారికి మరణశిక్ష విధించాలని ఖతౌలీ బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైని డిమాండ్ చేశారు.

Update: 2020-03-08 10:11 GMT

గత నెలలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది మృతి వెనుక దోషులుగా తేలిన వారికి మరణశిక్ష విధించాలని ఖతౌలీ బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఖతౌలి పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీ గా డ్యూటీ చేసిన పొలిసు అధికారాలపై కొంతమంది దారుణాలకు పాల్పడ్డారని.. మానవత్వం మరచి ప్రాణాలు తీసారని.. ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక ఉన్న వారికి మరణశిక్ష విధించాలని పేర్కొన్నారు. అంతేకాదు యుపి శాసనసభ్యులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తోటి బిజెపి ఎమ్మెల్యే సంగీత సోమ్ "కిల్లర్లను రోడ్డుపై కాల్చి చంపాలి" అని చేసిన ప్రకటనకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.

కాగా గత నెల ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో ఒక డ్రైన్‌లో పడిఉన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో సెక్యూరిటీ అధికారి అంకిత్‌ శర్మ (26) మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా కొంతమంది ఆందోళనకారుల గుంపు ఆయనపై దాడిచేసి హత్య చేశారు. అయితే అంకి్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత తాహిర్ హుస్సేన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అతన్ని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాహిర్‌పై హత్యారోపణలు రావడంతో ఆయనను ఆప్ సస్పెండ్ చేసింది.


Tags:    

Similar News