Delhi: మళ్లీ రూ.25 పెరిగిన గ్యాస్ బండ ధర

Delhi: అల్ప జీవులకు నెత్తిమీద గ్యాస్ బండ ధర

Update: 2021-02-25 04:35 GMT

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ ఇండియా


Delhi: అసలే కరోనాతో జీవనోపాధి కోల్పోయి, అరకొర వేతనాలతో అల్లాడుతున్న అల్ప జీవులకు నెత్తిమీద గ్యాస్ బండ ధర గుదిబండగా మారి గుండెల్లో బాంబులై పేలుతున్నాయి. ఒకవైపు పెట్రో మంట, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను గ్యాస్ కంపెనీలు గ్యాస్ ధరను మరో 25 రూపాయలు పెంచేశాయి. 

ఈ నెలలోనే మూడు సార్లు సిలిండర్‌ ధరలు పెరగడంతో సామాన్యుడిపై అదనపు భారం పడనుంది. ఈనెల 4న రూ. 25 పెంచగా.. 15న మరో రూ. 50 పెంచాయి. మొత్తంగా మూడు సార్లు గ్యాస్‌ సిలిండర్‌పై రూ.వంద మేర పెంచాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో దేశరాజధాని దిల్లీలో 14.2 కిలోల రాయితీ సిలిండర్‌ ధర రూ.794కి చేరింది.

Tags:    

Similar News