Uttar Pradesh: యూపీలో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా చాప్టర్ క్లోజ్..

Uttar Pradesh: యూపీలో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా చాప్టర్ క్లోజ్..

Update: 2023-05-04 12:09 GMT

Uttar Pradesh: యూపీలో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా చాప్టర్ క్లోజ్..

Uttar Pradesh: మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ అహ్మద్ ఎన్ కౌంటర్ మరువకముందే ఉత్తరప్రదేశ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఉన్న అనిల్ దుజానాను ఆ రాష్ట్ర ఎస్టీఎఫ్ పోలీసులు హతమార్చారు. పశ్చిమఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన అనిల్ దుజానాపై 62 క్రిమినల్ కేసులు ఉన్నాయంటే అతడు ఎంత కరడుగట్టిన నేరస్థుడో అర్థం చేసుకోవచ్చు. అనిల్ దుజానా అంటే భయానికి, ఉగ్రవాదానికి మారు పేరని అక్కడి స్థానికులు చెప్పుకుంటారు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన అనిల్ దుజానా 2012 నుంచి జైలులో ఉన్నాడు.

2021లో బెయిల్ పై విడుదల అయ్యాడు. బెయిల్ పై విడుదలైన తర్వాత పాత కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మరోవైపు జైలు నుంచి విడుదల అయిన వెంటనే గౌతమ్ బుద్ధ్ నగర్ లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నవారిని అనిల్ దుజానా బెదిరించాడు. తన ఆప్త మిత్రుడు గ్యాంగ్ స్టర్ నరేష్ భాటి హత్య తర్వాత అనిల్ దుజానా అతని గ్యాంగ్ కు లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో మాఫియాను మట్టి కరిపిస్తానంటూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏదిఏమైనా, అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ అనంతరం ఎస్టీఎఫ్ పోలీసులు యూపీలో చేసిన రెండవ అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇదే. 

Tags:    

Similar News