త్వరలో 4 కొత్త లేబర్‌ కోడ్‌లు అమలు.. ఉద్యోగుల పనితీరు, జీతాలు పెరిగే అవకాశం..

New Wage Code 2022: వచ్చే ఏడాది నుంచి నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Update: 2021-12-22 09:58 GMT

త్వరలో 4 కొత్త లేబర్‌ కోడ్‌లు అమలు.. ఉద్యోగుల పనితీరు, జీతాలు పెరిగే అవకాశం..

New Wage Code 2022: వచ్చే ఏడాది నుంచి నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది వేతన జీవులకు శుభపరిణామమనే చెప్పాలి. దీనివల్ల ఉద్యోగుల పనితీరు, జీతాల విషయంలో చాలా మార్పులు జరుగుతాయి. కొత్త నిబంధనల అమలు తర్వాత ఉద్యోగులు రోజుకు 12 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. అయితే వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలి. ఈ విధంగా, మూడు రోజులు సెలవు పొందవచ్చు. ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు పనిచేస్తే అతను వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల అతిపెద్ద ప్రయోజనం ఓవర్ టైంకు కలిసివస్తుంది.

మీరు 15 నిమిషాల కంటే ఎక్కువ పని చేస్తే కంపెనీ ఓవర్ టైం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త లేబర్ కోడ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలను విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త కార్మిక చట్టాన్ని ఖరారు చేసింది. ఇప్పుడు రాష్ట్రాలు తమ పక్షాన నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగులకు అందుతున్న జీతంపై ప్రభావం పడుతుంది. దీని ప్రకారం ప్రాథమిక వేతనం మొత్తం జీతంలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. బేసిక్ జీతం పెంపుతో పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది.

కొత్త నిబంధనల ప్రకారం.. ఏ ఉద్యోగి కూడా ఐదు గంటలకు మించి పని చేయడానికి వీలులేదు. ఐదు గంటల తర్వాత ఉద్యోగికి అరగంట విరామం ఉంటుంది. కొత్త నిబంధనలను ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కంపెనీలు ఏ వర్గం ఉద్యోగులను దోపిడీ చేయకూడదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు కొత్త నిబంధనల ప్రయోజనం ప్రారంభమవుతుంది. కొత్త వేతన కోడ్ చట్టం 2019 ప్రకారం.. ఉద్యోగి ప్రాథమిక వేతనం కంపెనీ ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు (CTC). ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ శాలరీ తగ్గించి ఎక్కువ అలవెన్సులు ఇవ్వడం వల్ల కంపెనీపై భారం తగ్గుతోంది. కొత్త వేతన నియమావళి అమలుతో ఉద్యోగుల వేతన స్వరూపం మారిపోనుంది. ఉద్యోగుల 'టేక్ హోమ్ శాలరీ' తగ్గిపోతుంది. ఎందుకంటే బేసిక్ పే పెంచడం ద్వారా ఉద్యోగుల పీఎఫ్‌లో ఎక్కువ కోత పడుతుంది. అంటే వారి భవిష్యత్తు మరింత భద్రంగా ఉంటుంది.

Tags:    

Similar News