బాయిలర్ పేలి నలుగురు మృతి, 30 మందికి గాయాలు

Update: 2020-02-29 02:57 GMT

హర్యానా రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ పేలి నలుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జజ్జర్‌లోని బహదుర్గ్ లోని పారిశ్రామిక ప్రాంతం ప్రైవేట్ డైజెస్టర్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో శిధిలాలు మీద పడటంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మంటల ప్రభావం ప్రక్కనే ఉన్న నాలుగు కర్మాగారాల భవనానికి కూడా పాకింది.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ సంఘటన జరిగిందని జజ్జర్ డిప్యూటీ కమిషనర్ (డిసి) జితేందర్ కుమార్ తెలిపారు.

'ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మందికి గాయాలయ్యాయి మరియు వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో సమీప ప్రాంతాల పిల్లలు, మహిళలు ఉన్నారు. గాయపడిన 15 మంది బహదుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగిలిన వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ... ఫ్యాక్టరీ లోపల ఎవరూ చిక్కుకోలేదు.' అని ఆయన తెలిపారు. ఘటనపై వివరాలు తెలుసుకున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బాధితుల బంధువులకు రూ .2 లక్షల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని మంటలు ఇతర భవనాలకు అంటుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News