ఆ దేశంలో ధరించినట్టుగానే మిడి డ్రెస్‌లో ఇవాంకా.. ధర ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.. ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరెడ్ కుష్నర్లు కూడా భారత్ కు విచ్చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.. ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరెడ్ కుష్నర్లు కూడా భారత్ కు విచ్చేశారు.. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించిన డ్రెస్ అందరిని ఆకట్టుకుంది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడి డ్రెస్‌ను ఆమె ధరించారు. బౌవుడ్ నెక్లైన్తో, పఫ్పుడ్ స్లీవ్స్‌తో డ్రెస్ చాలా అందంగా ఉంది. ఆమె ఎత్తుకు డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా ఎర్రటి హైహీల్స్ కూడా ధరించారు.
దీంతో ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. వాస్తవానికి ఈ దుస్తులలో ఇవాంకా కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2019 సంవత్సరంలో ఆమె అర్జెంటీనాను సందర్శించినప్పుడు ఇదే డ్రెస్ ను ధరించారు. ఈ దుస్తుల ధర రూ .1,71,331 (USD 2,385). ఇదిలావుంటే ఇవాంకా 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు.. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్ఫిగర్, ససాన్ జీన్స్ బ్రాండ్లకు మోడల్‌గా ఆమె పనిచేశారు. 1997లో సెవంటీన్ మ్యాగజైన్ కవర్‌పేజీపై కనిపించింది.