Himachal Pradesh: ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకృతి విలయతాండవం

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షాలు * వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు

Update: 2021-07-12 13:16 GMT

హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సము (ఫోటో ది హన్స్ ఇండియా)

Himachal Pradesh: ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకృతి విలయతాండవం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలకు తోడు పిడుగులు ప్రాణాలను మింగేశాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నంతగా కురిసిన కుంభవృష్టి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేసింది. అటు.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పిడుగుల వాన కురిసింది. ఈ మూడు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు ఏకంగా 60మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ధర్మశాలలో గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురిసింది. ఈ ఆకస్మిక వరదలకు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి.

ధర్మశాలకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రా జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో జవజీవనం అస్తవ్యస్తమయ్యింది. వీధుల్లో వరద నీరు నదులను తలపించింది. ఈ ప్రాంతంలోని కొన్ని హోటళ్లకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. కాంగ్రాతోపాటు మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేశాయి.

Tags:    

Similar News