Congress Meeting: దేశ వ్యాప్త సమస్యలపై పోరాటాలకు కాంగ్రెస్ సిద్ధం

Congress Meeting: దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో 9 మంది సభ్యుల కమిటీ భేటీ * కాంగ్రెస్ వార్ రూంలో 2 గంటల పాటు జరిగిన సమావేశం

Update: 2021-09-14 16:00 GMT

దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యుల భేటీ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Congress Meeting: దేశ వ్యాప్త సమస్యలపై పోరాటాలకు కాంగ్రెస్ సిద్ధం అయ్యింది. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల కాంగ్రెస్ కమిటీ తొలి భేటీ జరిగింది. కాంగ్రెస్ వార్ రూంలో రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఉద్యమాల ప్రణాళిక రూపొందించారు. ఈనెల 20 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలతో కలిసి పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు సహా పలు అంశాలపై సంయుక్త ఆందోళనలు చేపతామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై ఏ విధంగా ఆందోళనలు చేపట్టాలనే అంశంపై చర్చించారు.

2024లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, సెమినార్లు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రాత్, బీకే హరిప్రసాద్ హాజరయ్యారు.

Tags:    

Similar News