Mumbai: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి పొగలు
Mumbai: పొగలు బయటకు రావడంతో స్ధానికుల ఆందోళన
Mumbai: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి పొగలు
Mumbai: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం పై భాగం నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం చూసి స్ధానికులు ఆందోళన చెందారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. ముంబయి నారిమన్ పాయింట్‌లో ట్రైడెంట్ హోటల్ ఉంది. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఉదయం 7 గంటలకు హోటల్ పై భాగం నుంచి దట్టమైన పొగలు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది.
జనం ఆందోళనగా బయటకు వచ్చారు. హోటల్ నుంచి పొగలు వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. హోటల్ బాయిలర్ రూం నుంచి పొగలు వస్తున్నాయని అధికారులు తెలిపారు.కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసి జనం ఊపిరి పీల్చుకున్నారు.