Viral Video: గళ్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం.. బాల్కనీలోంచి దూకిన అమ్మాయిలు

Update: 2025-03-28 15:36 GMT

Viral Video: గళ్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం.. బాల్కనీలోంచి దూకిన అమ్మాయిలు

Fire accident at girls' hostel: గళ్స్ హాస్టల్లో ఏసి కంప్రెషర్ పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన ఇది. ఈ ఘటనలో హాస్టల్ భవనం అంతా మంటలు వ్యాపిస్తుండటంతో మెయిన్ డోర్ నుండి తప్పించుకునే వీలు లేకపోయింది. దీంతో రెండో అంతస్తులో ఉన్న గదిలో చిక్కుకుపోయిన ఇద్దరు అమ్మాయిలు బాల్కనీలోంచి దూకి బయటికి వచ్చారు. వారిలో ఒకరు కిందపడి గాయాలపాలు కాగా మరొకరు నిచ్చెన సాయంతో సురక్షితంగా కిందకు దిగారు. గాయపడిన అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు.

గ్రేటర్ నొయిడాలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై నొయిడా చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ స్పందించారు. గ్రేటర్ నొయిడాలోని నాలెడ్జ్ పార్క్ 3 ఏరియాలోని అన్నపూర్ణ హాస్టల్లో రెండో అంతస్తులో ఏసీ కంప్రెషర్ పేలడం వల్ల మంటలు వ్యాపించినట్లు తెలిపారు. హాస్టల్లో అన్ని అంతస్తుల్లో కలిపి మొత్తం 160 మంది అమ్మాయిల వరకు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో హాస్టల్లో కొంతమందే ఉన్నారు. వారు అంతా సురక్షితంగా బయటపడినట్లు ప్రదీప్ తెలిపారు. 

Tags:    

Similar News