Coronavirus: భారతదేశానికి రోకటి పోటులా కరోనా వైరస్.. కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్థ
కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కుదేలవుతున్న భారతదేశానికి ఇది రోకటి పోటులా తయారైంది.
కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కుదేలవుతున్న భారతదేశానికి ఇది రోకటి పోటులా తయారైంది.. ఈ మహమ్మారితో పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దాంతో ఎగుమతులు, దిగుమతుల పై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ సక్రమణతో దేశవ్యాప్తంగా 30 వేల కోట్ల రూపాయలు నష్టం? వాటిల్లినట్టు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇందులో వరుస నష్టాలను చవిచూశారు ఇన్వెస్టర్లు.. అయితే శుక్రవారం స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులతో ఆరంభమైనా కొనుగోళ్లు ఊపందుకోవడంతో లాభాల బాట పట్టినట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మూడు నెలలవుతున్నా వైరస్ వ్యాప్తి తగ్గక పోవడంతో ప్రభుత్వాలపై తీవ్ర ఆర్ధిక భారం పడుతూ ఉంది. ఇప్పటికే కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణ లొ 16 నమోదయ్యాయి. దాంతో ఇరు ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు షాపింగ్ మాల్, సినిమా హాల్స్, సూపర్ మార్కెట్ లో ,రైతు బజార్లు, షూటింగ్ ల రద్దు వంటి చర్యలు చేపట్టాయి. దీంతో మార్కెట్ల మీద పెను ప్రభావం చూపిస్తోంది..
ఆకుకూరలు, కూరగాయలు, మిర్చి ,పసుపు, కోళ్ల పరిశ్రమ మొదలగు వాటికి ఎగుమతులు లేక మార్కెట్ లోనే ఉండి పోయాయి.. ఇక మిర్చి రైతుల భాధలు చెప్పుకునేవి కావు. ప్రస్తుతం క్విన్టాల్ ధర 15 వేల వరకూ పలుకుతుండగా.. తాజాగా ఎగుమతి నిలిచిపోవడంతో కొనేవాళ్లే కరువయ్యారు. అలాగే చైనాకు ఎగుమతి అవ్వాల్సిన గ్రానైట్ పూర్తిస్థాయిలో కాకపోయినా పెద్దఎత్తున నిలిచిపోయింది. దాంతో రూ.10 వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నాయని చెపుతున్నారు.
ఇక కరోనా మహమ్మారి ప్రభావంతో రోజుకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు సినీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరో15 రోజులు కొనసాగితే ఈ నష్టాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలను బయటకు రాకుండా ఉండి.. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సూచిస్తున్నారు. అలాగే వీలైనంత త్వరగా మందులు కనిపెట్టాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.