Coronavirus: దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా

Coronavirus: పలు రాష్ర్టాలు కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకోకపోవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

Update: 2021-03-16 01:20 GMT

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగంగా విస్తరిస్తున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పలు రాష్ర్టాలు కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకోకపోవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తెలుగు రాష్ర్టాల్లోనూ కరోనా మహమ్మారి భయపెడుతోంది. పరెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 17 అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిట ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కేసులు, వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు.

దేశంలో కరోనా ఉధృతి అధికమైయ్యింది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. పొరుగునే ఉన్న మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాలతో పాటు ఏపీ, తెలంగాణాలోనూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. పాఠశాలలు ప్రారంభించడంతో..స్కూల్సే హాట్ స్పాట్స్ కేంద్రాలుగా మారుతున్నాయి. స్కూళ్లలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో టీచర్స్ స్టూడెంట్స్ తో పాటు ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఏపీలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ర్టంలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 92 వేల 8 కి పెరగగామరణించిన వారి సంఖ్య 7 వేల 185కు చేరింది. గడిచిన 24 గంటల్లో 103 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

తెలంగాణలోనూ రోజు రోజుకు కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ ను సీరియస్ గా తీసుకోకపోవడంతోనే పాజిటివ్ కేసువల సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కొత్తంగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ర్టంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య మూడు లక్షల ఒక వెయ్యి 318కి చేరింది. ఇప్పటి వరకు 1654 మంది ప్రాణాలు కోల్పోగా. ప్రస్తుతం 1983 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. అనేక రాష్ర్టాల్లొ కొత్త కేసులు అధికమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈనెల 17న వర్చువల్ విధానంలో సీఎంలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త కేసుల సంఖ్య వృద్ధి, కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్నారు ప్రధాని మోడీ.

Tags:    

Similar News