Delhi farmers: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన

* రైతుల కట్టడికి సరిహద్దుల్లో భారీ భద్రతా చర్యలు * అంచెలంచెలుగా బారికేడ్లు, ఇనుప కంచెలు, రోడ్లపై మేకులు * రంగంలోకి దిగిన రెండు రెట్ల బలగాలు

Update: 2021-02-03 02:40 GMT

file image

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళన కొనసాగుతోంది. సాగు చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన చేస్తామంటూ రైతులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రం అత్యంత కఠినమైన చర్యలు తీసుకొంటోంది. భారీ ఎత్తున బలగాలను దింపడమే కాక అన్ని మార్గాలనూ మూసేసి, పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులతో పాటు ఇతర రూట్లను కలిపి ఐదు జోన్లుగా విభజించి ఎవ్వరిని కూడా అడుగు ముందుకు వేయకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.

రోడ్లపైకి ఎవ్వరని రానివ్వకుండా భద్రతను పెంచారు. రోడ్లపై ఇనుప మేకులు గుచ్చిన షీట్లను ఉంచారు. రోడ్లపై ఇనుప మేకులు ఉంచడంపై తీవ్ర దుమారం రేపుతోంది. తమపై కేంద్రం వ్యవహారిస్తున్న తీరు, భద్రతా ఏర్పాటుపై రైతు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్రంతో తిరిగి చర్చలు జరిపే విషయంలో తమ వైఖరిని కఠినం చేశాయి. తమపై సాగిస్తున్న వేధింపులు ఆపితేనే చర్చలకు వస్తామని తేల్చిచేప్పాయి. నిత్యం విద్యుత్, నీళ్లు ఆపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రదర్శిస్తున్న అణిచివేత ధోరణులకు నిరసగా ఈ నెల 6న దేశవ్యాప్తంగా మూడు గంటల పాటు జాతీయ రహదారులను నిర్భంధిస్తామని కిసాన్ మోర్చా సంఘం ప్రకటించింది.

రైతులపై కేంద్రం చేస్తున్న అణిచివేస్తోన్న ధోరణిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మూడంచెల సిమెంటు దిమ్మలతో గోడలు కట్టడం కాదు.. వారధులు నిర్మించండి అంటూ ట్వీట్ చేశారు. రైతులతో యుద్ధం చేస్తున్నారా అంటూ ప్రియాంక వాద్రా ప్రశ్నించారు.

మరోవైపు రైతులకు సంబంధించిన అంశాలపై పార్లమెంటు లోపల, బయట చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో స్పష్టం చేశారు. సాగు చట్టాలపై రాజ్యసభలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. సాగు చట్టాలపై చర్చను చేపట్టాలంటూ ప్రతిపక్షా పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. వాటిని చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు.

జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ హింసపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ రామసుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

Tags:    

Similar News