Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన

Farmers Protest: * నేడు రైతు సంఘాలతో కేంద్రం ఎనిమిదో విడత చర్చలు * కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుల డిమాండ్ * సాగు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదననైనా పరిశీలిస్తామన్న కేంద్రం

Update: 2021-01-08 02:50 GMT

Farmers Protest

 ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదో సారి రైతులు, కేంద్ర మధ్య చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు మన్నంటాయి. 40 రైతు సంఘాల కేంద్ర మంత్రులు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత లాంటి కీలకాంశాలపై చర్చించనున్నారు.

గతంలో జరిగిన చర్చల్లో రెండు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయానికి కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అటు వ్యవసాయ చట్టాల్లోని అభ్యంతరాలపై అంశాల వారీగా చర్చిస్తామని కేంద్రం తెలిపింది. అలాగే ఇవాళ్టి చర్చలు సఫలం అవుతాయని కేంద్రవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఒకవేల చర్చలు విఫలమైతే మాత్రం భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేయాలని రైతు సంఘాల నేతలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నేడు జరిగే చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Full View


Tags:    

Similar News