Fact Check: రేపు బ్యాంకులు, స్కూలులకు సెలవు ఉందా? – నిజమెంతో తెలుసుకోండి!

జూన్ 6న జాతీయ సెలవుగా ప్రకటించారన్న వార్తలు తప్పుడు వదంతులే. కేంద్రం ఎలాంటి సెలవు ప్రకటించలేదు. కేవలం కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలోనే బ్యాంకులకు సెలవు ఉంది. నిజానిజాలపై క్లారిటీ తెలుసుకోండి.

Update: 2025-06-05 09:11 GMT

Fact Check: రేపు బ్యాంకులు, స్కూలులకు సెలవు ఉందా? – నిజమెంతో తెలుసుకోండి!

Fact Check: జూన్ 6న జాతీయ సెలవు ఉందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా తప్పుడు వదంతులే. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాతీయ సెలవు ప్రకటించలేదు. కేవలం కేరళ రాష్ట్రంలోని కొచ్చి, తిరువనంతపురం నగరాల్లో మాత్రమే బ్యాంకులు మూసివేస్తారు.

ఈద్-ఉల్-అద్హా (బక్రీద్) నేపథ్యంలో సెలవు అంటూ ఫేక్ పోస్ట్‌లు సోషల్ మీడియా వేదికలైన X (ట్విట్టర్), ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వైరల్ అవుతున్నాయి. "జూన్ 6న దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్కూలులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తారు" అని చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలతో కూడిన తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది.

అసలైన సమాచారం ఏంటంటే:

కేంద్రం జూన్ 6న జాతీయ సెలవుగా ప్రకటించలేదు.

RBI ప్రకారం, జూన్ 6న కేవలం కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు మాత్రమే సెలవు ఉంది.

మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూలులు, కేంద్ర కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తాయి.

ప్రజలకు సూచన:

తప్పుడు సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండండి. అధికారిక ప్రకటనలు లేకుండా సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దు.

Tags:    

Similar News