Tamilnadu: రంగపాళ్యంలో భారీ అగ్నిప్రమాదం.. 10మంది మృతి

Tamilnadu: శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

Update: 2023-10-17 13:43 GMT

Tamilnadu: రంగపాళ్యంలో భారీ అగ్నిప్రమాదం.. 10మంది మృతి

Tamilnadu: తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో రంగపాళ్యం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టపాసుల గోడౌన్ లో భారీ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ ఆవరణంలో తయారీ చేసిన టపాసులు పరిశీలిస్తుండగా పేలుడు ఘటన చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడటంతో.. ఊపిరి అందక 10 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. వారిని శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. కిచనయకన్ పట్టి గ్రామంలోనూ టపాసులు తయారుచేసే గోడౌన్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు మహిళా కార్మికులు గాయపడ్డారు. వారిని శివకాశిలోని ప్రభుత్వ ఆస్పత్రికే తరలించారు. కాగా... ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు అధికమవుతున్నా.. టపాసుల తయారీదారులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News