Jaya Prada: పరారీలో మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద
Jayaprada: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన జయప్రద
Jaya Prada: పరారీలో మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద
Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద పరారీలో ఉన్నట్టు రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ప్రకిటంచింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జయప్రదపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఘటనలో కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్ల, వారెంట్లు జారిచేసింది కోర్టు. అయినా జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ఆమెపై న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు జయప్రద పరారీలో ఉన్నట్టు ప్రకటించింది. వచ్చే నెల ఆరో తేదీన కోర్టులో హాజరు పర్చాలంటూ పోలీసులను ఆదేశించింది.