సోషల్ మీడియాలో తరచుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్నిసార్లు జంతువులు చేసిన చర్యలు సోషల్ మీడియాలో ప్రజలందరికీ వినోదంగా మారుతుంటాయి. అందులో మామిడి పండ్ల కోసం తిరుగుతున్న ఏనుగు అయినా మరొక వీడియోలో అర్థరాత్రి నిద్రిస్తున్న మొసలి నోటి నుండి చిరుత మాంసం దొంగిలించడం అయినా… ప్రజలకు వినోదాన్ని పంచుతుంటాయి.. ఇటువంటి వీడియోలను చూడటానికి నెటిజన్లు కూడా బాగా ఇష్టపడతారు.
ఇదిలావుండగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, రెండు ఏనుగులు ట్రక్ ల నుండి చెరకు తినడానికి ప్రయత్నిస్తాయి. వాస్తవానికి రెండు ఏనుగులను రెండు వేర్వేరు లారీల ద్వారా వేరే ప్రదేశానికి తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో లారీ.. మార్గంలో ఒక చోట ఆగింది.. అదే సమయంలో దానితో పాటు ఒక ట్రక్ కూడా వస్తుంది. అందులో చెరకు ఉంది.
అసలే ఏనుగులకు ఇష్టమైన తిండి, పైగా బలవర్ధకమైన ఆహరం.. దాంతో ఒక్కసారిగా ట్రక్ చెరకు చూస్తే ఊరుకుంటాయా..? అన్నంత పని చేశాయి.. చెరకు కర్రలను బలంగా లాగి లాగి నోట్లో వేసుకున్నాయి. దారి మధ్యలో స్నాక్స్ లాగా బలే దొరికాయిలే అనుకోని సంతోషంగా పార్టీ చేసుకున్నాయి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఏనుగులకు చెరకు అందింది. అయితే వెనకాల ఉండే సుశాంత్ అనే వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీశాడు.. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అందులో "చెరకు ఏనుగులకు అత్యంత ఇష్టమైన ఆహారం" అని రాసి పోస్ట్ చేసాడు.. దాంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు ఓ లుక్కేయండి..!
Delicious lunch break 😊
— Susanta Nanda IFS (@susantananda3) February 13, 2020
Sugarcane is one of favourite food of elephants. In captivity sugarcane is an integral part of the diet plan. To provide energy. pic.twitter.com/IsjJDQCx2k