వ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు

*బావిని తవ్వి.. మట్టిని పోసి.. ఎక్స్‌కవేటర్‌తో తోయడంతో బయటకొచ్చిన ఏనుగు

Update: 2022-06-27 12:15 GMT

వ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు

Jharkhand: వేటగాళ్ల బారి నుంచి తప్పించుకోబోయిన ఓ ఏనుగు.. పొరబాటున బావిలో పడింది విషయం తెలుసుకున్న అటవీ అధికారులు, స్థానికులు సహాయంతో బావిని తవ్వి ఎనుగును ఐదు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. ప్రాణాలను దక్కించుకోవడానికి ఒక్క రోజంత బావిలో ఈదుతూ గడిపిన ఏనుగు ఎట్టకేలకు బయటపడ బతుకు జీవుడా అనుకుంటూ అడవుల్లోకి వెళ్లిపోయింది. ఈ సంఘటన జార్ఖాండ్‌లోని రామ్‌గడ్‌ జిల్లాలో జరిగింది. ఎనుగు రెస్క్కూ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

జార్ఖండ్‌లోని రామ్‌గడ్‌ జిల్లాలోని గోలా అటవీప్రాంతంలో నుంచి ఏనుగులు తరచూ సమీపంలోని సంగ్రామ్‌పూర్‌, హల్లు ప్రాంతాల్లోని మొక్కజొన్న బెండను తినడానికి వస్తుంటాయి. అటవీ ప్రాంతంలో డజనుకు పైగా ఏనుగులు నిత్యం సంచరిస్తుంటాయి. అయితే వేటగాళ్లు ఎనుగలు వెంట పడడంతో అవి పరుగులు పెట్టాయి. ఈ క్రమంలో ఓ ఏనుగు పొలంలో తవ్విన బావిలోకి పొరపాటున పడిపోయింది. అందులో నీళ్లు ఉండడంతో ప్రాణాలను దక్కించుకునేందుకు రాత్రంతా ఈదుతూనే ఉంది. దాని అరుపులు గమనించిన అటవీ అధికారులు.. గ్రామస్థులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బావిని తవ్వి అందులో మట్టిని నింపారు. మరోవైపు ఎక్స్‌కవేటర్‌తో ఎనుగును వెనుక నుంచి బయటకు తోసి ఎట్టకేలకు ఎనుగును బయటకు తీశారు.

రెస్క్యూ టీమ్‌లో పాల్గొన్న అటవీ అధికారులు ఎనుగును బయటకు తీసేందుకు ఐదు గంటల పాటు శ్రమించారు. బావిలో పడిన ఏనుగుకు గాయాలయ్యాయి. బయటకు వచ్చిన తరువాత బతుకు జీవుడా అనుకుంటూ అటవీ ప్రాంతంవైపు ఆ ఏనుగు వెళ్లిపోయింది. వందలాది మంది సమీప గ్రామాల ప్రజలు.. ఎనుగు రిస్క్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎనుగును బయటకు సేందుకు జేసీబీతో తవ్వకాలను, దాన్ని కాపాడే దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఎనుగు రిస్క్యూ దృశ్యాలు వైరల్‌గా మారాయి. రిస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన అధికారులను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Full View


Tags:    

Similar News